Share News

ఆశాజనకంగా వర్షాలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:37 AM

నైరుతి రుతుపవనాలు ఆరంభంలోనే మంచి ఫలితాలిస్తున్నాయి. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఆశాజనకంగా వర్షాలు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 10: నైరుతి రుతుపవనాలు ఆరంభంలోనే మంచి ఫలితాలిస్తున్నాయి. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల తొలివారంలోనే జిల్లా సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో ఈ నెల సాధారణ వర్షపాతం కన్నా రెండుమూడు రెట్లు ఎక్కువగానే వానలు కురిశాయి. జిల్లా సాధారణ వర్షపాతం 80.8 మిమీ కాగా సోమవారం వరకు 89.6 మి.మీ నమోదైంది. 12 మండలాల్లో అధికంగా, 10 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 8 మండలాల్లో తక్కువ నమోదైంది. పలు మండలాల్లో వంకలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఈ వర్షాలు తొలకరి పైర్లకే కాకుండా మొత్తం ఖరీఫ్‌ సీజన్‌కు బాగా ఉపకరిస్తాయని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు చౌడేపల్లిలో 6.4మి.మీ, పులిచెర్ల 5.0, పూతలపట్టు 3.8, వెదురుకుప్పం 1.6, పెనుమూరులో 1.2మి.మీ వర్షం కురిసింది.

Updated Date - Jun 11 , 2024 | 01:37 AM