శ్రీవారి భక్తులతో ముచ్చటించిన హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jul 20 , 2024 | 01:01 AM
సౌకర్యాలెలా ఉన్నాయంటూ తిరుమలలో శ్రీవారి భక్తులతో హోంమంత్రి అనిత ముచ్చటించారు. కాలినడకన శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఆమె క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఈసందర్భంగా అక్కడున్న భక్తులను పలుకరించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ కొంతసేపు వారితో మాట్లాడారు.
తిరుమల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): సౌకర్యాలెలా ఉన్నాయంటూ తిరుమలలో శ్రీవారి భక్తులతో హోంమంత్రి అనిత ముచ్చటించారు. కాలినడకన శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఆమె క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఈసందర్భంగా అక్కడున్న భక్తులను పలుకరించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ కొంతసేపు వారితో మాట్లాడారు.