Share News

హిందూ ధర్మాన్ని కాపాడాలి

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:01 AM

మత మార్పిడులు చేయకుండా హిందువులు కలసి ఉండి, హిందూ ధర్మాన్ని కాపాడాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్రసరస్వతి సూచించారు.

హిందూ ధర్మాన్ని కాపాడాలి
కల్యాణ వేదిక వద్ద అనుగ్రహభాషణం చేస్తున్న కంచికామకోటి పీఠాధిపతి

ఐరాల(కాణిపాకం), మార్చి 13: మత మార్పిడులు చేయకుండా హిందువులు కలసి ఉండి, హిందూ ధర్మాన్ని కాపాడాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్రసరస్వతి సూచించారు. ధర్మ కార్యకలాపాలలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఆయన బుధవారం సాయంత్రం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాణిపాక ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి, మంచి పంటలు పండాలని స్వామిని కోరుకున్నట్లు తెలియజేశారు. కంచిపీఠం, కాణిపాకం అనుబంధంగా పౌరోహిత్యం, పద్ధతి పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశుతో చర్చించారు. అనంతరం కల్యాణ వేదిక వద్ద అనుగ్రహభాషణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ జగన్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరి, ఆలయ ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఉభయదారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 01:01 AM