ఊరొదిలి ఇరవై ఏళ్లయినా ఓటరే..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:25 AM
తుది ఓటర్ల జాబితాలో ఊరు వదిలి వెళ్లి ఏళ్లు గడిచినా ఓటరుగానే ఉన్నారు.
వెదురుకుప్పం, జనవరి 28: తుది ఓటర్ల జాబితాలో ఊరు వదిలి వెళ్లి ఏళ్లు గడిచినా ఓటరుగానే ఉన్నారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్ర పరిధికి సంబంధించి పచ్చికాపల్లంపేట గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(63) ఊరు వదిలి వెళ్లిపోయి ఇరవై ఏళ్లు గడుస్తున్నాయని స్థానికులు తెలిపారు. కానీ, అతడికి క్రమసంఖ్య-282తో ఇంటి సంఖ్య-3-5తో తాజా జాబితాలో ఓటు ఉంది.