Share News

నిజమైన పిస్టలే అని నిరూపించడానికి కాల్పులు జరిపాడు

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:30 AM

స్నేహితులంతా కలిసి మందుకొట్టారు. సరదాగా మాట్లాడుకున్నారు. జేబులో ఉన్న పిస్టల్‌ను ఒకరు చేతిలోకి తీసుకున్నారు.

నిజమైన పిస్టలే అని నిరూపించడానికి కాల్పులు జరిపాడు
మల్లికార్జునను విచారిస్తున్న సీఐ

మాజీ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు చేసిన పోలీసులు

స్నేహితులంతా కలిసి మందుకొట్టారు. సరదాగా మాట్లాడుకున్నారు. జేబులో ఉన్న పిస్టల్‌ను ఒకరు చేతిలోకి తీసుకున్నారు. దాన్ని చూసి మరొకరు ‘బొమ్మ పిస్టల్‌ తెచ్చుకున్నావా?’ అని ఎగతాళిగా అడిగారు. అందరూ గొల్లున నవ్వారు. అంతే పిస్టల్‌ తీసిన వ్యక్తి అహం దెబ్బతినింది. వెంటనే పిస్టల్‌ను నేలకు గురిపెట్టి టపీటపీ కాల్చి.. నిజమైనదే అని నిరూపించాడు. దీంతో చుట్టూ ఉన్నవాళ్లంతా భయపడి పరుగులు తీశారు. చిత్తూరు సీబీ రోడ్డులో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. కాల్పులు జరిపిన మిట్టూరు ఆశ్రమ వీధికి చెందిన కేఆర్‌ మల్లికార్జునను అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఆర్మీలో పనిచేస్తూ 2021లో పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను తీసుకున్నాడు. ప్రస్తుతం తిరుపతిలో కాంట్రాక్టు పద్ధతిపై ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడకపోవడం అదృష్టం. సీఐ విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- చిత్తూరు

Updated Date - Feb 01 , 2024 | 12:30 AM