Share News

పూలే స్ఫూర్తితో ముందుకు..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:30 AM

‘సామాజిక అసమానతలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే అలుపు ఎరగని పోరాటం చేశారు. ఆయన స్ఫూర్తితో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌, అదే బాటలో ప్రస్తుత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకోసం అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టారు’ అని టీడీపీ నేతలు చెప్పారు.

పూలే స్ఫూర్తితో ముందుకు..!
జిల్లా టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావ్‌ పూలే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు

టీడీపీ పాలనలో బడుగులకు సంక్షేమ పథకాలు అమలు చేసిందన్న నేతలు

చిత్తూరు సిటీ, ఏప్రిల్‌ 11: ‘సామాజిక అసమానతలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే అలుపు ఎరగని పోరాటం చేశారు. ఆయన స్ఫూర్తితో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌, అదే బాటలో ప్రస్తుత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకోసం అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టారు’ అని టీడీపీ నేతలు చెప్పారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతీరావ్‌ పూలే అని కొనియాడారు. టీడీపీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. అలాగే నగరంలోని పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, లోక్‌సభ పార్టీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌ నేతలు సురేంద్రకుమార్‌, కోదండయాదవ్‌, మోహన్‌రాజ్‌, కటారి హేమలత, కాజూరు బాలాజి, శ్రీధర్‌యాదవ్‌, కాజూరు రాజేష్‌, కంద, హేమాద్రి నాయుడు, తలారి రెడ్డెప్ప, శంకర్‌, ఈశ్వర్‌, తారక్‌, గోకుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:30 AM