Share News

గీజర్‌ పేలి వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:13 AM

ప్రమాదవశాత్తూ గీజర్‌ పేలడంతో ఓ వృద్ధురాలు మృతి చెందారు.

గీజర్‌ పేలి వృద్ధురాలి మృతి

చిత్తూరు, జనవరి 20: ప్రమాదవశాత్తూ గీజర్‌ పేలడంతో ఓ వృద్ధురాలు మృతి చెందారు. చిత్తూరు నగరంలోని సాంబయ్యకండ్రిగలో ప్రేమలత(73) శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గీజర్‌ ఆన్‌చేయగా, అది ప్రమాదవశాత్తూ పేలిపోయింది. ఈ ఘటనలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా, సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఒకటో పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 12:13 AM