Share News

వేటగాళ్ల ఉచ్చుకు గజరాజు బలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:40 AM

గంగవరం మండలంలోని బూడిదపల్లె సమీపంలో వేటగాళ్ల ఉచ్చుకు మగ ఏనుగు మృత్యువాతపడింది. బుధవారం రాత్రి వేటగాళ్లు అడవి జంతువుల కోసం బూడిదపల్లె సమీపంలోని రైతు లక్ష్మయ్య పొలంలో కరెంటు తీగలను అమర్చారు. అర్ధరాత్రి అటువైపుగా వచ్చిన ఒంటరి ఏనుగు వాటిని తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.

వేటగాళ్ల ఉచ్చుకు గజరాజు బలి
వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఏనుగు

గంగవరం, ఏప్రిల్‌ 18 : మండలంలోని బూడిదపల్లె సమీపంలో వేటగాళ్ల ఉచ్చుకు మగ ఏనుగు మృత్యువాతపడింది. బుధవారం రాత్రి వేటగాళ్లు అడవి జంతువుల కోసం బూడిదపల్లె సమీపంలోని రైతు లక్ష్మయ్య పొలంలో కరెంటు తీగలను అమర్చారు. అర్ధరాత్రి అటువైపుగా వచ్చిన ఒంటరి ఏనుగు వాటిని తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం ఉదయం పశువుల కాపరులు, రైతులు గుర్తించి అటవీశాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. గంగవరం అర్బన్‌ సీఐ చిన్నగోవిందు, ఎఫ్‌ఆర్‌వో శివన్న, జిల్లా అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఏనుగు కళేబరాన్ని పరిశీలించారు. ఒంటిపై ఉన్న గాయాలను బట్టి కరెంట్‌ షాక్‌తోనే మృతిచెందిందని నిర్ధారించారు. మగ ఏనుగు అని, దాని వయస్సు 20 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లా అటవీ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి, అక్కడే ఖననం చేశారు. ఏనుగు మృతికి కారణమైన వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 01:40 AM