Share News

మాజీ జమీందారు మృతి

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:36 AM

బంగారుపాళ్యంలో మంగళవారం ఉదయం మాజీ జమీందారు ఎంబీ సుబ్బరామరాజ (87) కన్నుమూశారు.

మాజీ జమీందారు మృతి
మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

బంగారుపాళ్యం, జనవరి 16: బంగారుపాళ్యంలో మంగళవారం ఉదయం మాజీ జమీందారు ఎంబీ సుబ్బరామరాజ (87) కన్నుమూశారు. ఈయన 1962 నుంచి 1988 వరకు బంగారుపాళ్యం మేజర్‌ పంచాయతీ సర్పంచిగా 25సంవత్సరాలు కొనసాగారు. బ్రిటీష్‌ కాలంలో టిర్కాకా డెవల్‌పమెంట్‌ కమిటీ బంగారుపాళ్యంకు చైర్మన్‌గా ఉన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ పాఠశాల, మొగిలేశ్వర కల్యాణ మండపానికి స్థలదాత కూడా ఈయనే. మొగిలేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా కూడా కొనసాగుతున్నారు. దొరచెరువు పునర్నిర్మాణానికి అప్పట్లోనే ఆర్థికసాయం అందించారు. చిత్తూరులోని బీజడ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌గా 1961 నుంచి కొనసాగుతున్నారు. చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలో డైరెక్టర్‌గానూ ఉన్నారు. ఈయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన పార్థివదేహానికి పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జి మురళీమోహన్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్‌పీ జయప్రకాష్‌, వైసీపీ రాష్ట్ర పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.బి.కుమార్‌రాజా, మండల వైసీపీ కన్వీనర్‌ రామచంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీ శిరీష్‌ రెడ్డి, వైసీపీ నాయకులు విద్యారెడ్డి, కృపాసాగర్‌ రెడ్డి, నారే సోమశేఖర్‌, దత్తాత్రేయ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు ఎంబీ విజయకుమార్‌ తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 12:36 AM