ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టిపెడతా
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:59 AM
అధికారుల, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకందేలా కృషి చేస్తానని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. తిరుపతి కలెక్టర్‌గా గురువారం ఉదయం కలెక్టరేట్ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

తిరుపతి/తిరుమల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): అధికారుల, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకందేలా కృషి చేస్తానని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. తిరుపతి కలెక్టర్‌గా గురువారం ఉదయం కలెక్టరేట్ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు.పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.డెంగ్యూ జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామన్నారు. అంతకుముందు ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.కలెక్టర్‌గా శ్రీవారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.