నిర్దిష్ట ప్రణాళికతోనే రైతులకు ప్రయోజనం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:55 AM
వ్యవసాయ రంగంలో నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేసినప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని తిరుపతి పరిశోధన స్థానం సహాయ సంచాలకుడు రమణ పేర్కొన్నారు.

చిత్తూరు (సెంట్రల్), మార్చి 5: వ్యవసాయ రంగంలో నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేసినప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని తిరుపతి పరిశోధన స్థానం సహాయ సంచాలకుడు రమణ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు ఏరువాక కేంద్రంలో శాస్త్రవేత్తల 40వ జిల్లా స్థాయి సమన్వయకర్తల సమావేశంలో రమణ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహాయ విస్తరణ అధికారి ముకుందరావు మాట్లాడారు. 2024 ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, పట్టు పరిశ్రమ రంగాల్లో రైతులకు కలిగే ప్రయోజనాలు, సాగులో పాటించాల్సిన మెలకువలు, పంటలను కాపాడుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన వ్యవసాయ, సస్యరక్షణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన శాఖ అధికారులు మురళీకృష్ణ, ప్రభాకర్, మధుసూదన్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రెడ్డిరాము, సుమతి, జాన్, విశ్వనాథ్, రైతులు పాల్గొన్నారు.