Share News

ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రోడ్డు నిర్మాణంపై కసరత్తు

ABN , Publish Date - May 24 , 2024 | 01:18 AM

విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేయనున్న రోడ్డు భూసేకరణపై అధికారుల బృందం కసరత్తు చేసింది.

ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రోడ్డు నిర్మాణంపై కసరత్తు
రోడ్డు నిర్మాణంపై కసరత్తు చేస్తున్న అధికారుల బృందం

శ్రీకాళహస్తి, మే 23 : విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేయనున్న రోడ్డు భూసేకరణపై అధికారుల బృందం కసరత్తు చేసింది. తొట్టంబేడు మండలం పొయ్య వద్ద వున్న జాతీయ రహదారి నుంచి బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని పల్లమాల వద్ద తడ రహదారి వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ రోడ్డును 9.5కి.మీ పొడవు, 45మీటర్ల వెడల్పుతో నాలుగులేన్ల రోడ్డును నిర్మించేందుకు ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు పలువురికి పరిహారం కూడా అందజేశారు.ఈ నేపథ్యంలో గురువారం ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఆర్‌అండ్‌బీ, సోషియల్‌ ఆర్‌ఆర్‌ తదితర శాఖల అధికారుల బృందం పొయ్య, గుమ్మడిగుంట, గౌడమాల గ్రామాలతో పాటు బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కొత్తపాళెం, పల్లమాల గ్రామాల వద్ద పర్యటించారు. రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోయే ఇండ్లను, పంటలను, ప్రభుత్వ ఆస్తులను పరిశీలించారు.అలాగే ఆస్తులు కోల్పోతున్న కుటుంబాల వారితో మాట్లాడారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలపై అఽధ్యయనం చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ ప్రాంతంలో ఇండస్రియల్‌ కారిడార్‌లో భాగంగా సెజ్‌ ఏర్పాటవుతుందని తెలిపారు.అదికారులు దేవరాజు, రాంబాబు, గిరీశ్వర్‌, ఉదయ్‌శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 01:18 AM