Share News

పంటలపై ఏనుగుల స్వైరవిహారం

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:48 AM

పులిచెర్ల మండలంలో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. కమ్మపల్లి పంచాయతీలో రెండు రోజులుగా తిష్టవేసిన ఏనుగుల గుంపు పంటలపై స్వైర విహారం చేస్తోంది.

పంటలపై ఏనుగుల స్వైరవిహారం
ధ్వంసమైన టమోటా పంట - విరిగిపోయిన మామిడి చెట్లు

కల్లూరు, జూన్‌ 10: పులిచెర్ల మండలంలో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. కమ్మపల్లి పంచాయతీలో రెండు రోజులుగా తిష్టవేసిన ఏనుగుల గుంపు పంటలపై స్వైర విహారం చేస్తోంది. టమోటా, మామిడి, వరినారుకు అపారనష్టం వాటిల్లింది. కమ్మపల్లికి చెందిన పార్థసారథి నాయుడు, విజయసారథినాయుడు మామిడి తోటల్లోకి ఆదివారం రాత్రి ప్రవేశించిన ఏనుగులు చెట్లను ధ్వంసం చేశాయి. నీటి పైపులను తొక్కేశాయి. సుమారు 2 టన్నుల మామిడికాయలు నేలరాలాయి. దేశిరెడ్డిగారిపల్లికి చెందిన ఎల్లారెడ్డి ఎకరా టమోటా తోటను తొక్కేశాయి. జగన్నాథరెడ్డి 20 మామిడిచెట్లను విరిచేశాయి. మామిడికాయలు నేలరాలాయి. డ్రిప్‌ పైపులు ధ్వంసమయ్యాయి. కురవపల్లిలో గోవర్ధన్‌కు చెందిన వరినారును తొక్కి నాశనం చేశాయి. 5 ఏనుగుల గుంపు దాడి చేశాయని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.

Updated Date - Jun 11 , 2024 | 01:48 AM