Share News

పంట పొలాలపై ఏనుగుల దాడులు

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:53 AM

పాకాల, ఐరాల మండలాల సరిహద్దులో మొరవపల్లె, కాకర్లవారిపల్లె, గుట్టపాళ్యం, గూబలవారిపల్లె, వేదగిరివారిపల్లె సమీపంలోని పంటపొలాలపై ఆదివారం రాత్రి ఏనుగులు దాడి చేశాయి.

పంట పొలాలపై ఏనుగుల దాడులు
గుట్టపాళ్యం సమీపంలో పొలాల్లో ఏనుగుల పాదముద్రలు, ధ్వంసమైన వరి

పాకాల, ఫిబ్రవరి 26: పాకాల, ఐరాల మండలాల సరిహద్దులో మొరవపల్లె, కాకర్లవారిపల్లె, గుట్టపాళ్యం, గూబలవారిపల్లె, వేదగిరివారిపల్లె సమీపంలోని పంటపొలాలపై ఆదివారం రాత్రి ఏనుగులు దాడి చేశాయి. గూబలవారిపల్లెకు చెందిన సేతురాం, వేదగిరివారిపల్లెకు చెందిన శివాజి, గుట్టపాళ్యంకు చెందిన విజయనాయుడులకు చెందిన వరిపొలాలను తొక్కి తీవ్ర నష్టం కలిగించాయి. గుట్టపాళ్యం విజయనాయుడు పరిపొలంవద్ద నున్న బావిలో ఓ గున్న ఏనుగు పడిపోగా.. దానిని రక్షించి పెద్ద ఏనుగులు తీసుకెళ్లిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రదేశమంతా ఏనుగులు తొక్కేయడంతో వరిపంట ధ్వంసమైంది. పంటపొలాలపై కొన్ని నెలలుగా వరుస దాడులతో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నా.. సంబంధిత అటవీ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగుల బెడద తప్పించాలని కోరుతున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:53 AM