Share News

ఎనిమిది మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:57 AM

అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం టాస్క్‌ఫోర్సు పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. 33 దుంగలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

ఎనిమిది మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు

- 33 దుంగలు, కారు స్వాధీనం

మంగళం, ఆగస్టు 23: అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం టాస్క్‌ఫోర్సు పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. 33 దుంగలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం రెండు బృందాలు అన్నమయ్య జిల్లా బాలపల్లి, భాకారాపేట అటవీప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహించారు. ఆర్‌ఐ కృపానందంకు చెందిన ఆర్‌ఎ్‌సఐ కె.అల్లీబాషా బృందం స్థానిక అటవీఅధికారులతో కలిసి సిద్దలేరు నుంచి కూంబింగ్‌ చేపట్టారు. వీరు శుక్రవారం ఉదయం రాజంపేట డివిజన్‌ బాలపల్లి బీట్‌ పరిధిలో దాట్లు సమీపానికి చేరుకోగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకెళుతూ కనిపించారు. చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. దుంగలను వదలిపారిపోయారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో.. తమిళనాడు కళ్లకురిచి జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌(22), శంకర్‌(29), వెంగటేశన్‌(34), ఎంజీఆర్‌(46), లక్ష్మణన్‌(57), సెల్వరసు(21)గా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి 25ఎర్రచందనం దుంగలను స్వాఽధీనం చేసుకున్నారు. అలాగే ఆర్‌ఐ(ఆపరేషన్స్‌) కె.సురే్‌షకుమార్‌రెడ్డికి చెందిన ఆర్‌ఎ్‌సఐ కేఎస్‌ లింగాధర్‌ బృందం చంద్రగిరివైపు అటవీప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టింది. కల్యాణిడ్యాం నుంచి ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను తనిఖీ చేశారు. భాకరాపేట రేంజి, నాగపట్ల సెక్షన్‌ పరిధిలోని నరసింగాపురం రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్‌ చేస్తూ కనిపించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కారును స్మగ్లర్లు వేగంగా నడుపుతూ వెళ్లిపోయారు. లింగాధర్‌ టీం బైక్‌లపై వెంటాడి చంద్రగిరి క్లాక్‌ టవర్‌ వద్ద అడ్డుకున్నారు. కారులోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలోని ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రైల్వే బ్రిడ్జి కింద వారు వదలి వెళ్లిన మరో ఎర్రచందనం దుంగను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన హరిస్టాటిల్‌ రవి(30), రంజిత్‌ చిన్న పయ్యన్‌(30)గా గుర్తించారు. ఈ రెండు కేసులను తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీ్‌సస్టేషన్‌కు తరలించగా, సీఐ సురే్‌షకుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 01:57 AM