Share News

నియంతృత్వ పోకడలతో విద్యారంగం నిర్వీర్యం

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:28 AM

కార్పొరేట్‌ రంగానికి కొమ్ముకాసి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పాలకులకు ఉద్యమాలతో సమాధానం చెబుతామని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హెచ్చరించారు.

నియంతృత్వ పోకడలతో విద్యారంగం నిర్వీర్యం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆందోళన

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 28: కార్పొరేట్‌ రంగానికి కొమ్ముకాసి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పాలకులకు ఉద్యమాలతో సమాధానం చెబుతామని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హెచ్చరించారు. చిత్తూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు దేవరాజులు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల కోట్ల రూపాయలతో పాఠశాలలను ఉద్దరించామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. వీటిలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో చెప్పాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమాన్ని విస్మరించి, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు, తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలన్నారు. ఉత్తుత్తి పీఆర్‌సీ కమిటీల పేరుతో మభ్యపెట్టడం మానుకోవాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. మున్సిపల్‌ టీచర్లకు ఇప్పటి వరకు సర్వీసు రూల్స్‌ అమలు చేయలేకపోవడందారుణమని విమర్శించారు. సమగ్రశిక్ష, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చొరవచూపాలన్నారు. అంతకు ముందు ఎస్టీయూ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వర్‌రావు, రఘునాథరెడ్డి, గంటా మోహన్‌, పురుషోత్తం, హేమచంద్రరెడ్డి, లోకనాధ్‌, మధన్‌మెహన్‌, గురుకుమార్‌, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మదన్‌మోహన్‌

జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్‌.ఆర్‌.మదన్‌మోహన్‌రెడ్డి (యాదమరి), ప్రధాన కార్యదర్శిగా బి.మోహన్‌(పుంగనూరు), ఆర్థిక కార్యదర్శిగా టి.యువరాజ్‌ (కార్వేటినగరం), అసోసియేట్‌ అధ్యక్షలుగా రమణారెడ్డి, చిట్టిబాబు, చంద్రన్‌, సుబ్రమణ్యం, అదనపు ప్రధాన కార్యదర్శులుగా అమర్నాథ్‌రెడ్డి, కిషోర్‌, చెంగల్‌రాయల్‌, విజయలక్ష్మి, పవన్‌కుమార్‌, బొబ్బిలి, ఉపాధ్యక్షులుగా జ్యోతిశ్వరుడు, సుమతి, శ్రీనివాసులు, మోహన్‌, కమలాపతి, రాజా, పరదేశి, వాసు, కార్యదర్శులుగా హరినాథ్‌, కన్నయ్య, లక్ష్మిదేవి, ఫణి, వనిత, ఉషారాణి, పురుషోత్తం, చంద్రశేఖర్‌, కోదండయ్య, చైతన్య, వెంకటరత్నం, ఆంజనేయులు, ఆర్థిక కమిటీ సభ్యులుగా సూర్యకుమార్‌, శ్రీనివాసులు, ధనరాజ్‌, నాగరాజు, జనార్దన్‌, మహిళా కన్వీనర్‌గా జి.అనిత, మైనారిటీ కన్వీనర్‌గా యాసిన్‌ షరీఫ్‌, సీపీఎస్‌ కమిటీ కన్వీనర్‌గా భాస్కర్‌రాజు, ఉపాధ్యాయ కన్వీనర్‌గా సర్ధార్‌, ప్రచార కమిటీ కన్వీనర్‌గా ప్రసాద్‌, సాంస్కృతిక కమిటీ కన్వీనర్‌గా మంజుల, రాష్ట్ర కౌన్సిలర్లుగా గంటా మోహన్‌, దేవరాజురెడ్డి, పురుషోత్తం, జగన్మోహన్‌రెడ్డి, లోకనాథరెడ్డి, జయరామప్ప, ఇలియాస్‌ బాషా, హేమచంద్రరెడ్డి, రమే్‌షకుమార్‌, శ్రీదేవి, జనార్థన్‌రెడ్డిని ఎన్నుకున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:28 AM