Share News

రైల్వేస్టేషన్లలో ఎకానమీ మీల్స్‌

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:05 AM

వేసవి కాలంలో రైళ్లలో సాధారణ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఎకానమీ మీల్స్‌ అందిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

రైల్వేస్టేషన్లలో ఎకానమీ మీల్స్‌

తిరుపతి (సెంట్రల్‌), ఏప్రిల్‌ 23: వేసవి కాలంలో రైళ్లలో సాధారణ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఎకానమీ మీల్స్‌ అందిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 12 రైల్వేస్టేషన్లలో 18 కౌంటర్ల ద్వారా ఈ భోజనాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాదు, విజయవాడ, రేణిగుంట, తిరుపతి, పాకాల, గుంతకల్‌, వికారాబాదు, రాజమండ్రి, డోన్‌, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాదు స్టేషన్లలో ఈ ఆహారాన్ని ప్రయాణికులకు అందిస్తున్నామని అధికారులు వివరించారు. వీటిల్లో రెండు రకాల మీల్స్‌ ఉన్నాయి. మొదటి రకం రూ.20, రెండో రకం స్నాక్స్‌తోపాటు భోజనం రూ.50 చొప్పున ధరలు నిర్ణయించారు. ఇప్పటికే భారత రైల్వేలో 100 స్టేషన్లలో 150 కేంద్రాల్లో ఎకానమీ మీల్స్‌ విక్రయిస్తున్నామన్నారు. గత ఏడాది 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశామని తెలియజేశారు. భారత రైల్వే, ఐఆర్‌సీటీసీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.

Updated Date - Apr 24 , 2024 | 07:36 AM