Share News

సాంకేతిక సమస్య్చతో.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - May 31 , 2024 | 01:31 AM

సాంకేతిక సమస్యలతో జిల్లావ్యాప్తంగా ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు నిలిచిపోయాయి.

సాంకేతిక సమస్య్చతో.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్లకోసం వేచివున్న క్రయవిక్రయదారులు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 30: సాంకేతిక సమస్యలతో జిల్లావ్యాప్తంగా ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు నిలిచిపోయాయి. నూతన సాఫ్ట్‌వేర్‌ కార్డ్‌ ప్రైమ్‌ 2.0 అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడపాదడపా రిజిస్ట్రేషన్ల పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. గురువారం మంచి రోజు కావడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పెద్దయెత్తున క్రయవిక్రయదారులు హాజరయ్యారు. చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్తావేజు రెండోపేజీపై క్రయవిక్రయదారులు, సబ్‌ రిజిస్ట్రార్‌ సంతకాలు (ఈ-సైన్‌) పడలేదు. దీనివల్ల ఉదయం 10నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం లేకుండా కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది, ఎస్‌ఆర్‌లు సతమతమయ్యారు. 3.15 గంటల తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రిజిస్ట్రేషన్‌ శాఖ పనితీరుపై మండిపడ్డారు.

Updated Date - May 31 , 2024 | 01:31 AM