Share News

డిజిటల్‌ పేమెంట్లతో మందుబాబుల తంటాలు

ABN , Publish Date - May 26 , 2024 | 02:08 AM

మద్యం కొనుగోలుకు డిజిటల్‌ పేమెంట్ల నిబంధన పెట్టడంతో శనివారం మందుబాబులు అల్లాడిపోయారు.

డిజిటల్‌ పేమెంట్లతో మందుబాబుల తంటాలు

కోట, మే 25 : మద్యం కొనుగోలుకు డిజిటల్‌ పేమెంట్ల నిబంధన పెట్టడంతో శనివారం మందుబాబులు అల్లాడిపోయారు.కోట,వాకాడు, చిట్టమూరు మండలాల్లోని మద్యంషాపుల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఫోన్‌పే, ఏటీఎం కార్డుల ద్వారానే లావాదేవీలు చేయాలని షరతు విధించడంతో అవి లేనివారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మద్యంషాపుల వద్దే వేచి ఉండడంతో తరువాత నగదు కొనుగోళ్లను మద్యం షాపుల సిబ్బంది అనుమతించారు.ఈ విషయమై ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జానకిరామ్‌ను అడగ్గా డిజిటల్‌ పేమెంట్లకే ప్రాధాన్యం ఇవ్వమని మద్యం షాపుల సిబ్బందిని ఆదేశించామని చెప్పారు.అయితే వినియోగదారులు అలవాటు పడేవరకూ నగదు కొనుగోళ్లను కూడా కొంతవరకూ అనుమతిస్తామని వివరించారు.

Updated Date - May 26 , 2024 | 07:08 AM