Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

హథీరాంజీ మఠం భూములు కొని మోసపోవద్దు

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:32 AM

ప్రజలెవరూ హథీరాంజీ మఠానికి చెందిన భూములు సంబంధం లేని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి మోసపోవద్దని మఠం ఫిట్‌పర్సన్‌ రమే్‌షనాయుడు సూచించారు.

హథీరాంజీ మఠం భూములు కొని మోసపోవద్దు

- ఎప్పటికైనా ఆక్రమణులను తొలగిస్తాం

- మఠం ఫిట్‌పర్సన్‌ రమే్‌ష నాయుడు

తిరుమల, మార్చి2(ఆంధ్రజ్యోతి): ప్రజలెవరూ హథీరాంజీ మఠానికి చెందిన భూములు సంబంధం లేని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి మోసపోవద్దని మఠం ఫిట్‌పర్సన్‌ రమే్‌షనాయుడు సూచించారు. తిరుమలలోని హథీరాంజీ మఠంలో సీజ్‌ చేసి ఉన్న మహంతు గదిని శనివారం ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యవతి, జిల్లా ఎండోమెంట్‌ అధికారి రామకృష్ణారెడ్డి, మఠం తాత్కాలిక మహంతు ఓం ప్రకా్‌షదాస్‌ తదితరులతో కలిసి రమేష్‌ నాయుడు తెరిచారు.లోపలున్న కొన్ని వస్తువులను స్వాధీన పరుచుకున్నారు. అనంతరం రమేష్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు.ఇటీవల మఠానికి తాత్కాలిక మహంతుగా నియమితుడైన ప్రకా్‌షదా్‌సకు నివాసం కోసమే గది తెరిచామన్నారు. మఠం భూముల్లోని ఆక్రమణలను తొలగించే విషయంలో తిరుపతి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందన్నారు.ఆక్రమణలు తొలగించేందుకు తీసుకువెళ్లే పొక్లయినర్‌ ముందు కూర్చోవడంతో పాటు తమపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు.ఇకనైనా తక్కువ రేటుకు వస్తున్నాయని కష్టపడి సంపాదించిన డబ్బును సంబంఽధం లేని వ్యక్తులకు ఇచ్చి మఠం భూములు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఏరోజుకైనా మఠం భూములను స్వాధీనపరుచుకోవడంతో పాటు అందులోని కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు.మఠానికి చెందిన భూములపై ధార్మిక పరిషత్‌ ప్రత్యేక సర్వే టీంను ఏర్పాటు చేసిందన్న ఆయన కబ్జాలో వున్న శాశ్వత నిర్మాణాలపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.మఠానికి గతంలో మహంత్‌గా ఉండి సస్పెండైన అర్జున్‌దా్‌స తప్పించుకు తిరుగుతున్నారన్నారు.ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి కూడా సహకరించలేదన్నారు. ఈ క్రమంలో కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా అర్జున్‌దా్‌సను శాశ్వతంగా తొలగించినట్టు తెలిపారు. ఇకపై మఠానికి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.అనధికారికంగా మఠం భూములను ఓ ప్రైవేట్‌ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న ఆయన బంధుమిత్రులను మఠాల్లో వివిధ పోస్టుల్లో నియమించారన్నారు.మఠం నిధులను కూడా దుర్వినియోగం చేశారన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 01:32 AM