Share News

రేషన్‌ దుకాణాల్లో రాగిపిండి పంపిణీ

ABN , Publish Date - Mar 01 , 2024 | 02:13 AM

రేషన్‌ దుకాణాల్లో రాగిపిండి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు

రేషన్‌ దుకాణాల్లో రాగిపిండి పంపిణీ

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 28: రేషన్‌ దుకాణాల్లో రాగిపిండి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకుని బియ్యంతో పాటు చౌక దుకాణాల్లో రాగిపిండిని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాగిపిండి బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.40 ఉండగా చౌకదుకానాల్లో కేవలం రూ.11కే అందిస్తున్నట్లు వెల్లడించారు.శుక్రవారం నుంచి కేజీ నుంచి మూడు కేజీల వరకు బియ్యానికి బదులుగా రాగిపిండి ఇస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 02:13 AM