Share News

రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:50 AM

విజయపురం మండలం కోసలనగరం పంచాయతీలో ఏపీఐఐసీకీ భూములు అప్పగించిన రైతులకు మంగళవారం మంత్రి రోజా చెక్కులు పంపిణీ చేశారు.

రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ

విజయపురం, మార్చి 5: విజయపురం మండలం కోసలనగరం పంచాయతీలో ఏపీఐఐసీకీ భూములు అప్పగించిన రైతులకు మంగళవారం మంత్రి రోజా చెక్కులు పంపిణీ చేశారు. మొదటి విడతగా 1541.41 ఎకరాల భూమిని రైతులు ఏపీఐఐసీకీ అప్పగించారు. వీటిలో రహదారులు వేయడానికి 29.69 ఎకరాలకుగాను రూ.9.64 లక్షలు చొప్పున 27 మందికి రూ.2.40 కోట్లు పంపిణీ చేశారు. ఎంపీటీసీ కన్నెమ్మ, సర్పంచ్‌ ఉమామహేశ్వరి, ఆర్బీకే చైర్మన్‌ గుణశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ మల్లికార్జునరావ్‌, నాయకులు శేఖర్‌రాజు, హరికృష్ణ, చెంచువరప్రసాద్‌, పెద్దగొళ్ల, సోమశేఖర్‌, రవివర్మ, నారపరాజు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:50 AM