Share News

2,41,946 మందికి సామాజిక పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:39 AM

జిల్లాలో మే నెలకు సంబంధించి సామాజిక పింఛన్లు శనివారం 2,69,684 మందికిగాను 2,41,946 మందికి పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ ప్రభావతి తెలిపారు.

2,41,946 మందికి సామాజిక పింఛన్ల పంపిణీ

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 1: జిల్లాలో మే నెలకు సంబంధించి సామాజిక పింఛన్లు శనివారం 2,69,684 మందికిగాను 2,41,946 మందికి పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ ప్రభావతి తెలిపారు. ఇక మంచానికే పరిమితమై బ్యాంకుల వద్దకు రాలేని వృద్ధులు, ఇతర జిల్లాలో బ్యాంకు ఖాతాలున్న వారికి 73,819మందికిగాను 59,466మందికి పంపిణీ చేశామన్నారు. 1,82,480మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పింఛను నగదు జమైందని, 13,385మందికి జమ కావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.

బ్యాంకుల వద్ద వృద్ధుల పడిగాపులు

శనివారం మధ్యాహ్నం పైనుంచి సాయంత్రం వరకు కూడా చాలామంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. మరోవైపు వృద్ధులు నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 9.30గంటలకు 90శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమైనట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు ఆదివారం, బ్యాంకులకు సెలవు కావడంతో పింఛనుదారులు నగదు తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం తీరుపై పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 08:24 AM