Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పుంగనూరులో నేడు ధర్మ పోరాట సభ

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:17 AM

భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పుంగనూరులో ధర్మ పోరాట సభ నిర్వహిస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ తెలిపారు.

పుంగనూరులో నేడు ధర్మ పోరాట సభ

పుంగనూరు, మార్చి 2: భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పుంగనూరులో ధర్మ పోరాట సభ నిర్వహిస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో రైతుల శ్రమదోపిడీ, నిరుద్యోగ సమస్య, బడుగుబలహీన వర్గాల సమస్యలు, తదితర అంశాలపై సభలో ప్రస్తావించడం జరుగుతుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పుంగనూరులోని చదళ్ల-కాటిపేరి రోడ్డులోని తన మామిడి తోటలో జరిగే ఈ కార్యక్రమానికి బీసీవై కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు.

Updated Date - Mar 03 , 2024 | 01:17 AM