Share News

ధను్‌షది ఆత్మహత్య కాదు.. హత్యే

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:47 AM

గంగాధర నెల్లూరు మండలం వింజం దళితవాడకు చెందిన ధను్‌షది ఆత్మహత్య కాదని.. అమ్మాయి తరపువారే హత్య చేశారంటూ అతడి కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు.

ధను్‌షది ఆత్మహత్య కాదు.. హత్యే
మృతిచెందిన ధనుష్‌

మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. రాస్తారోకో

గంగాధరనెల్లూరు, మార్చి 28: గంగాధర నెల్లూరు మండలం వింజం దళితవాడకు చెందిన ధను్‌షది ఆత్మహత్య కాదని.. అమ్మాయి తరపువారే హత్య చేశారంటూ అతడి కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. బాధ్యులను అరెస్ట్‌ చేయాలంటూ గురువారం సాయంత్రం వింజం బస్టాప్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. వీరు తెలిపిన ప్రకారం.. ధనుష్‌, దళవాయిపల్లె దళితవాడకు చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఈనెల 15న వీరిద్దరూ తవణంపల్లె మండలంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకోవాలని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలిసి అమ్మాయి బంధువులు ధను్‌షని మందలించారు. అదేరోజు సాయంత్రం గంగాధరనెల్లూరు పోలీ్‌సస్టేషన్‌లో వీరిద్దరి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు విచారించారు. ఆ అమ్మాయి మేజర్‌ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చని పోలీసులు చెప్పి పంపారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వింజం దళితవాడకు సమీపంలో ఓ చెట్టుకు ధనుష్‌ ఉరేసుకున్నట్లు కుటుంబీకులకు తెలిసింది. వీరి సమాచారంతో సీఐ శంకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ధనుష్‌ మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం చేసి.. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తలకు గాయమైనట్లు వారి బంధువులు గుర్తించారు. దీంతో ధనుష్‌ ఆత్మహత్య చేసుకోలేదని, అమ్మాయి తరపున బంధువులు హత్యచేసి చెట్టుకు ఉరేసి వెళ్లుంటారనే అనుమానం కలిగింది. వెంటనే మూడు గంటలపాటు వింజం బస్టా్‌పవద్ద రోడ్డుపై వీరు బైఠాయించారు. ధనుష్‌ హత్యకు కారణమైన వారిని వెంటనే అరె్‌స్టచేసి చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. సీఐలు శంకర్‌, విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ రామాంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని రోడ్డుపై కూర్చోవడం సరికాదని సర్దిచెప్పారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ప్రకారంగా కేసు నమోదుచేసి, హత్యకు కారణమైన వారిని అరెస్ట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ధను్‌షకు అంత్యక్రియలు నిర్వహించాలని సూచించగా.. వారు అంగీకరించలేదు. శుక్రవారం అంత్యక్రియలు చేస్తామని వారి బంధువులు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:47 AM