Darshan-ఐదేళ్ల తర్వాత శ్రీవారి దర్శనం
ABN , Publish Date - Sep 15 , 2024 | 01:32 AM
టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్య్గక్షుడు, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ ఐదేళ్ల తర్వాత కుటుంబ సమేతంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
- పంతం వీడిన టీడీపీ నేత నరసింహయాదవ్
తిరుమల, సెప్టెంబరు14(ఆంధ్రజ్యోతి): టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్య్గక్షుడు, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ ఐదేళ్ల తర్వాత కుటుంబ సమేతంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైసీపీ పరిపాలనను నిరసిస్తూ గత ఐదేళ్లుగా (పార్టీ అధినేత చంద్రబాబు దర్శనానికి వచ్చినప్పుడు మినహా) ఆయన శ్రీవారిని దర్శించుకోలేదు. వైసీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలకు నిరసనగా ఆయన దీక్ష పూనారు. ప్రభుత్వం మారిన తర్వాత శనివారం తన 40వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దీక్షను శనివారంతో విరమించుకున్నట్లు నరసింహయాదవ్ తెలిపారు.