Share News

పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:28 AM

బోయకొండకు ఆదివారం భక్తులు పోటెత్తారు. గంగమ్మ దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి ప్రీతికరమైన ఆషాడ మాసం రెండో ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.

పోటెత్తిన భక్తజనం
క్యూలైన్లలో భక్తులు

ఫ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న 40 వేల మంది

చౌడేపల్లె, జూలై 14: బోయకొండకు ఆదివారం భక్తులు పోటెత్తారు. గంగమ్మ దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి ప్రీతికరమైన ఆషాడ మాసం రెండో ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మవారి దర్శనానికి 2 గంటలపాటు క్యూలలో వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం 5 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది. దాదాపు 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజే బోయకొండ గంగమ్మకు రూ.19 లక్షల ఆదాయం సమకూరింది. కొండపై నుంచి కింద వరకు రెండు కిలోమీటర్ల పొడవునా కార్లు నిలిచిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది కలగింది. ఆలయ ఈవో ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jul 15 , 2024 | 01:28 AM