Share News

మేటిమంద వద్ద జంట ఏనుగులు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:33 AM

సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ చెన్నపట్నం డ్యాం వద్ద బుధవారం రాత్రి జంట ఏనుగులు సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

మేటిమంద వద్ద జంట ఏనుగులు

సోమల, ఫిబ్రవరి 1: సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ చెన్నపట్నం డ్యాం వద్ద బుధవారం రాత్రి జంట ఏనుగులు సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. డ్యాం సమీప మామిడి లో జంట ఏనుగులు డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేశాయి. నడింపల్లె, మాలపల్లె, దాదెం గొల్లపల్లె పరిసరాల్లో సంచరించి గురువారం పగలు మేటిమంద పొలాల వద్ద ఏనుగుల సంచారం ను రైతులు గుర్తించి ఇళ్లకు చేరుకున్నారు. మూడేళ్ల కిత్రం ఈప్రాంతంలోనే ఏనుగుల మంద సంచరించాయి. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:33 AM