టీడీపీ ఎంపీటీసీ దంపతుల హత్యకు కుట్ర
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:14 AM
టీడీపీ ఎంపీటీసీ దంపతుల హత్యకు కుట్ర పన్ని కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చిన వైసీపీ నాయకుల వుదంతమిది. ఎర్రావారిపాలెం మండలం కూరపర్తివారిపల్లికి చెందిన అభ్యుదయవాది అన్నాసముద్రం మధుసూదన్ టీడీపీ నాయకుడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇతను అదే గ్రామానికి చెందిన ఈశ్వరమ్మను గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం ఎంపీటీసీ. మధుసూదన్ రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు పలుసార్లు గొడవపడ్డారు. మండలానికి చెందిన ఓ బడా వైసీపీ నాయకుడి సహకారంతో ఆ పార్టీ వర్గీయులు ప్రతాపరెడ్డి, సిద్ధరామిరెడ్డి, నారాయణరెడ్డి ఎంపీటీసీ దంపతులను హత్య చేసేందుకు కుట్ర పన్నారు.

కిరాయి వ్యక్తులతో వైసీపీ నేతల ఒప్పందం
బహిర్గతం కావడంతో తప్పొప్పుకున్న నిందితులు
ఎర్రావారిపాలెం,జూన్ 26 : టీడీపీ ఎంపీటీసీ దంపతుల హత్యకు కుట్ర పన్ని కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చిన వైసీపీ నాయకుల వుదంతమిది. ఎర్రావారిపాలెం మండలం కూరపర్తివారిపల్లికి చెందిన అభ్యుదయవాది అన్నాసముద్రం మధుసూదన్ టీడీపీ నాయకుడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇతను అదే గ్రామానికి చెందిన ఈశ్వరమ్మను గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం ఎంపీటీసీ. మధుసూదన్ రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు పలుసార్లు గొడవపడ్డారు. మండలానికి చెందిన ఓ బడా వైసీపీ నాయకుడి సహకారంతో ఆ పార్టీ వర్గీయులు ప్రతాపరెడ్డి, సిద్ధరామిరెడ్డి, నారాయణరెడ్డి ఎంపీటీసీ దంపతులను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. కేవీపల్లికి చెందిన కిరాయి వ్యక్తులతో రూ.5లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఎర్రావారిపాలెం, తిరుపతి ప్రాంతాల్లో కిరాయివ్యక్తులు రెండుసార్లు హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో ఎన్నికలు జరగడం, టీడీపీ అధికారంలోకి రావడంతో కిరాయి ముఠా పన్నాగం ఆలస్యమైంది.దీంతో హత్య చేసేందుకు తామిచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని కిరాయి వ్యక్తులపై వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అప్పటికే మధుసూదన్ మంచితనం గురించి తెలుసుకున్న కిరాయి వ్యక్తులు మనసు మార్చుకున్నారు. హత్య పన్నాగం గురించి అతడికే చెప్పి క్షమించాలని కోరారు. హత్య కుట్రదారులు తమతో జరిపిన ఫోన్ సంభాషణలను కూడా మధుకు వినిపించారు. హత్య కుట్ర బహిర్గతం కావడంతో గ్రామస్తులందరూ విస్మయం చెందారు. ఈ నేపథ్యంలో ఆరేటమ్మ గుడి ప్రాంగణం వద్ద బుధవారం మండలానికి చెందిన పెద్దలందరూ సమావేశమై వైసీపీ నేతలు ముగ్గురినీ పిలిపించారు.కుట్రదారులు తమ అపరాధాన్ని మన్నించాలని వేడుకొన్నారు. ఆరేటమ్మ గుడి అభివృద్ధికి తలో రూ.10 లక్షలు ఇస్తామన్నారు. వీరిని గ్రామ బహిష్కరణ చేయాలని తీర్మానించినా మధుసూదన్ వద్దని వారించారు. కక్ష,ప్రతీకారం వీడి కలసి ఉందామని హితవు పలికారు.ఈలోపు కుట్రదారులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.