Share News

నిలకడగా నిమ్మధరలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:01 AM

గూడూరు నిమ్మ మార్కెట్‌ లో కొద్దిరోజులుగా నిమ్మకాయల కొనుగోళ్లు నిలకడగా సాగుతుండడంపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కూడా కిలో నిమ్మకాయల ధర రూ. 90 వరకూ పలికింది. లూజు బస్తా రూ. 6,800, టిక్కీ బస్తా రూ.4,250 పలికింది.

నిలకడగా నిమ్మధరలు

గూడూరు అర్బన్‌, జూన్‌ 8: గూడూరు నిమ్మ మార్కెట్‌ లో కొద్దిరోజులుగా నిమ్మకాయల కొనుగోళ్లు నిలకడగా సాగుతుండడంపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కూడా కిలో నిమ్మకాయల ధర రూ. 90 వరకూ పలికింది. లూజు బస్తా రూ. 6,800, టిక్కీ బస్తా రూ.4,250 పలికింది. కనిష్ఠంగా కిలో రూ.60 పలికింది. గతేడాది జూన్‌లో కిలో రూ.10 నుంచి రూ.30 వరకు పలకగా ఈ సారి మూడు రెట్లు అదనంగా ధర, విక్రయాలు పెరగడంతో నిమ్మ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తున్నా నిమ్మ ధరలు స్థిరంగా ఉండడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 01:01 AM