Share News

తిరుపతిలో 1న కాంగ్రెస్‌ బహిరంగ సభ

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:24 AM

ప్రత్యేక హాదా అజెండాతో తిరుపతిలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు.

తిరుపతిలో 1న కాంగ్రెస్‌ బహిరంగ సభ
విలేకర్ల సమావేశంలో గిడుగు రుద్రరాజు

ప్రత్యేక హోదా అజెండాగా నిర్వహిస్తున్నామన్న గిడుగు

చిత్తూరు రూరల్‌/పలమనేరు, ఫిబ్రవరి 27: ప్రత్యేక హాదా అజెండాతో తిరుపతిలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మంగళవారం ఆయన చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో, పలమనేరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు గడిచినా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను బాగుచేయాలంటే తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలన్నీ బీజేపీకి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. ఆ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తాము ప్రజల మేలు చేసే పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ సచిన్‌పైలట్‌, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఇతర నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సభకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చిత్తూరు సమావేశంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతం, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకుడు శంకర్‌, ఏఐసీసీ మెంబర్‌ పార్థసారథిరెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు విక్టోరియా, రాణి, నేతలు చిట్టిబాబు, శంకర్‌ టిక్కి రాయల్‌, వెంకటేష్‌, నరసింహులు, పరదేశి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. పలమనేరు పార్టీ కార్యాలయంలో నాయకులు శ్రీరామమూర్తి, పార్థసారథిరెడ్డి, రవీంద్రరెడ్డి, ప్రభాకర్‌, ధనంజయగౌడు, భాస్కర్‌, దొరస్వామి, మణి తదితరులు గిడుగు రుద్రరాజును కలిశారు.

Updated Date - Feb 28 , 2024 | 12:24 AM