Share News

పేద ఖైదీలను ఆదుకునేందుకు కమిటీ

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:34 AM

బెయిల్‌ లభించకుండా, జరిమానా చెల్లించేందుకు డబ్బుల్లేకుండా జైల్లో ఉంటున్న పేదఖైదీలకు ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకునే దిశగా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు కానుంది.

పేద ఖైదీలను ఆదుకునేందుకు కమిటీ

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 28: బెయిల్‌ లభించకుండా, జరిమానా చెల్లించేందుకు డబ్బుల్లేకుండా జైల్లో ఉంటున్న పేదఖైదీలకు ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకునే దిశగా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌గా జైళ్ల సూపరింటెండెంట్‌, సభ్యులుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, ఎస్పీ, జిల్లా జడ్జిచే నామినేట్‌ చేసే ఇన్‌చార్జి జడ్జి ఉంటారు. జైల్లో వున్న పేద ఖైదీల కేసును బట్టి బెయిల్‌ పొందేందుకు లేదా, జరిమానా చెల్లించేందుకు ఈ కమిటీ సిఫార్సు మేరకు నిధులను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో మంజూరు చేస్తుంది. అవసరమైతే నోడల్‌ అధికారిని నియమించుకోవడానికి అనుమతిచ్చింది.

Updated Date - Feb 29 , 2024 | 12:34 AM