Share News

మదనపల్లెలో చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు

ABN , Publish Date - Jul 24 , 2024 | 01:41 AM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దుండగులు రికార్డులు కాల్చిన ఘటనపై మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా అక్కడికి మదనపల్లెకు వెళ్లి ఈ ఘటనపై లోతుగా విచారించారు. ఈ క్రమంలోనే చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, వెంకటేశ్వర్లు కూడా మంగళవారం మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి హాజరయ్యారు.

మదనపల్లెలో చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు

చిత్తూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దుండగులు రికార్డులు కాల్చిన ఘటనపై మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా అక్కడికి మదనపల్లెకు వెళ్లి ఈ ఘటనపై లోతుగా విచారించారు. ఈ క్రమంలోనే చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, వెంకటేశ్వర్లు కూడా మంగళవారం మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి హాజరయ్యారు. సిసోడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఇద్దరు కలెక్టర్లకు కీలక విచారణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కలెక్టర్లు మంగళవారం నుంచే తమకు అప్పగించిన బాధ్యతల్ని అమలు చేయడం ప్రారంభించినట్లు సమాచారం. కాగా, జిల్లాల విభనజకు ముందు పుంగనూరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉండేవి. దీంతో పుంగనూరు నియోజకవర్గ రికార్డులు ఇంకా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఉండే అవకాశాలున్నాయని సమాచారం. గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం అనేక ప్రాంతాల్లో భూఅక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అదే సమయంలో మంగళవారం పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో అధికారుల సోదాల్లో రెండు సంచుల రికార్డులు బయటపడ్డాయి. దీంతో కాలిపోయిన రికార్డులకు, జిల్లాకూ లింకు ఉందా అనే దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 24 , 2024 | 09:17 AM