Share News

కలెక్టర్‌ తనిఖీలు

ABN , Publish Date - Apr 22 , 2024 | 02:17 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం సత్యవేడు మండలంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. తొలుత దాసుకుప్పం పోలీస్‌ చెక్‌పోస్టును తనిఖీ చేశారు.

కలెక్టర్‌ తనిఖీలు

సత్యవేడు, ఏప్రిల్‌ 21: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం సత్యవేడు మండలంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. తొలుత దాసుకుప్పం పోలీస్‌ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల్లో ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం రవాణా కాకుండా నిఘా వుంచాలని సూచించారు.దాసుకుప్పంలోని ఆదర్శ పాఠశాలలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూమును, పోలింగ్‌ సిబ్బందికి ఇచ్చే ఎన్నికల సామగ్రిని, కంపార్ట్‌మెంట్‌ యూనిట్‌ తదితరాలను పరిశీలించారు. ఈవీఎం సెకండ్‌ ర్యాండమైజేషన్‌ను సెక్టార్‌ వారీ ఏర్పాటుతో, బందోబస్తు నడుమ చేపట్టాలని సూచించారు. పక్కనే ఉన్న బాలికల గురకుల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను పరిశీలించారు.తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ హెల్ప్‌డె్‌స్కను తనిఖీ చేశారు.ఎన్నికల అధికారి నరసింహులు, తహసీల్దారు, సెక్టోరల్‌ అధికారులు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 02:17 AM