Share News

సీఎం పర్యటన రద్దు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:43 AM

సీఎం జగన్మోహన్‌రెడ్డి సోమవారం నాటి రామకుప్పం మండల పర్యటన రద్దయింది.

సీఎం పర్యటన రద్దు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలే కారణమంటున్న వైసీపీ వర్గాలు

చిత్తూరు కలెక్టరేట్‌/రామకుప్పం, ఫిబ్రవరి 1: సీఎం జగన్మోహన్‌రెడ్డి సోమవారం నాటి రామకుప్పం మండల పర్యటన రద్దయింది. తిరిగి ఎప్పుడు ఉంటుందనేది ప్రకటించాల్సి ఉంది. ఈనెల 5న హంద్రీ-నీవా కాలువను ప్రారంభించడంతో పాటు ఆసరా సమావేశం, బహిరంగ సభలో సీఎం పాల్గొనాల్సి ఉంది. దీనికిగాను గురువారం కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, జిల్లా అధికారులందరూ సీఎం పర్యటన ఏర్పాట్లకోసం వెళ్లారు. అదే సమయంలో కలెక్టరేట్‌లో జేసీ శ్రీనివాసులు అధ్యక్షతన సీఎం పర్యటన ఏర్పాట్లపై సమావేశమూ జరిగింది. తిరిగి సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లో మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జిల్లా అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమావేశం జరుగుతుందని వర్తమానం వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రానికంతా సీఎం పర్యటన రద్దయినట్లు సమాచారం వచ్చింది. ఈ నెల 5వ తేది నుంచి మూడు రోజులపాటు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పర్యటన రద్దయినట్లు అనధికారికంగా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే సీఎం పర్యటన ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతకుముందు, జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్సీ భరత్‌, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు తదితరులు మండలంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - Feb 02 , 2024 | 12:43 AM