Share News

తప్పుల చక్రవర్తి సీఎం జగన్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:25 AM

సీఎం జగన్‌ తప్పుల చక్రవర్తి అని, నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతారని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు.

తప్పుల చక్రవర్తి సీఎం జగన్‌

శ్రీవారి ఆభరణాలు అపహరించిన రమణ దీక్షితులు

మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపణ

చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 27: సీఎం జగన్‌ తప్పుల చక్రవర్తి అని, నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతారని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జలాలను కుప్పానికి తీసుకురావడానికి గత టీడీపీ ప్రభుత్వం రూ.470 కోట్లు ఖర్చుపెట్టి 87 శాతం పనులు పూర్తిచేసిందని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లల్లో కేవలం రూ.30 కోట్లు ఖర్చుపెట్టిందన్నారు. హంద్రీ- నీవా పనులు ఏ ప్రభుత్వ హయాంలో జరిగాయో ప్రజలకు తెలిసినా సీఎం జగన్‌ అబద్ధాలు చెప్పి, వారిని మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ గౌరవ ప్రధానార్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు శ్రీవారి అభరణాలను అపహరించారని దొరబాబు ఆరోపించారు.

Updated Date - Feb 28 , 2024 | 12:25 AM