Share News

జే బ్రాండ్‌ మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో సీఎం చెలగాటం

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:40 AM

మద్యపాన నిషేధం చేస్తా మని హామీ ఇచ్చి.. జే బ్రాండ్‌ మద్యం తీసుకొచ్చి.. ప్రజల ప్రాణాలతో సీఎం జగన్‌ చెలగాటం ఆడుతున్నాడని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు.

జే బ్రాండ్‌ మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో సీఎం చెలగాటం
టీడీపీ లో చేరినవారితో అమర్‌నాధ్‌రెడ్డి, థామస్‌

- మాజీ మంత్రి అమరనాథరెడ్డి

పెనుమూరు, ఫిబ్రవరి 11: మద్యపాన నిషేధం చేస్తా మని హామీ ఇచ్చి.. జే బ్రాండ్‌ మద్యం తీసుకొచ్చి.. ప్రజల ప్రాణాలతో సీఎం జగన్‌ చెలగాటం ఆడుతున్నాడని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. ఈ మద్యాన్ని విస్తరింపచేస్తున్న మంత్రి ఇదే నియోజకవర్గంలో ఉన్నాడని ముందు నారాయణస్వామి, జగన్‌ తమ బ్రాండ్లను తాగితే అవి ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నారు. ఆదివారం పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ గొడుగుమానుపల్లి గ్రామంలో వైసీపీ నుంచి సుమారు 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరిలో మహేందర్‌రెడ్డి, పులికల్లు వైసీపీ వార్డు మెంబరు భర్త గోపాలమందడి, సుధాకర్‌రెడ్డి, పట్టాభిరెడ్డి, దిలీప్‌, తదితరులున్నారు. ఈ సందర్భంగా అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా నిత్యావసరాల ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబునాయుడు, పెనుమూరు మండల అఽధ్యక్షుడు రుద్రయ్యనాయుడు, మాజీ ఎంపీపీ హరిబాబునాయుడు, పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కార్జాల అరుణ, యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్‌యాదవ్‌, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఈశ్వర్‌ప్రసాద్‌, ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నీలాగా బ్రోకర్‌ని కాదు

- నారాయణస్వామిపై విరుచుకుపడ్డ థామస్‌

‘ఓ పక్క ఎర్రచందనం దొంగ, మరో పక్క ఇసుక దొంగను పెట్టుకుని వారి నుంచి కమీషన్లు తీసుకుంటూ.. నీలాగా బ్రోకర్ని నేను కాదు.. డాక్టరుగా ఎంతో మందికి సేవ చేస్తున్నా’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై గంగాధరనెల్లూరు టీడీపీ ఇన్‌చార్జి థామస్‌ విరుచుకుపడ్డారు. గొడుగుమానుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘నేను చెన్నైకి అడుక్కుతినేదానికి పోయానని ఇష్టం వచ్చినట్లు వాగుతున్న నారాయణస్వామికి సవాల్‌ విసురుతున్నా.. రాజమన్నార్‌రెడ్డి, చెంగారెడ్డి దగ్గర అడుక్కుతిన్నది ఎవరు? నీదీ ఓ బతుకేనా? నువ్వు రాజకీయాలకు పనికిరాని చెత్తవి. రాబోవు ఎన్నికల్లో ప్రజలు నిన్ను చెత్త బుట్టలో వేస్తారు’ అని థామస్‌ అన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:40 AM