స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రస్థాయిలో చిత్తూరుకు 9వ ర్యాంకు
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:02 AM
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో చిత్తూరు నగరపాలక సంస్థకు జాతీయస్థాయిలో 143వ ర్యాంకు లభించింది.

చిత్తూరు, జనవరి 11: స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో చిత్తూరు నగరపాలక సంస్థకు జాతీయస్థాయిలో 143వ ర్యాంకు లభించింది. 1-10 లక్షల జనాభా కేటగిరీలో జాతీయస్థాయిలో 446 నగరాలతో పోటీపడి ఈ ర్యాంకు సాధించినట్లు కమిషనరు అరుణ గురువారం తెలిపారు. గతేడాది ఈ ర్యాంకు 153 ఉండిందన్నారు. ఈ సారి పది ర్యాంకులు మెరుగైనట్లు వివరించారు. రాష్ట్రస్థాయిలో 31 నగరాలతో పోటీపడుతూ 9వ స్థానంలో నిలిచిందన్నారు. ‘పారిశుధ్యం, చెత్తసేకరణ, డంపింగ్ యార్డు నిర్వహణ, ఓడీఎఫ్ ప్లస్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కేటగిరీల్లో గత ఏడాది కంటే మెరుగైన మార్కులు సాధించింది. 2022లో 3433.86 మార్కులు సాధించగా, 2023లో 5174.45 మార్కులు సాధించింది’ అని వివరించారు. సహకరించిన నగరప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.