చిత్తూరు జిల్లాలో చల్లబడిన వాతావరణం
ABN , Publish Date - May 18 , 2024 | 12:41 AM
ఎండలు మండిపోవాల్సిన సమయంలో వాతావరణంలో మార్పులొచ్చాయి. నెలన్నరగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ చిత్తూరు జిల్లా ప్రజలు వారం రోజులుగా చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, మే 17: ఎండలు మండిపోవాల్సిన సమయంలో వాతావరణంలో మార్పులొచ్చాయి. నెలన్నరగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ చిత్తూరు జిల్లా ప్రజలు వారం రోజులుగా చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరో వారం రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణంలో మార్పులు వచ్చాయని అంటున్నారు. వారం తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. కాగా జిల్లాలో శుక్రవారం అత్యధికంగా పులిచెర్లలో 35.4 డిగ్రీలు, అత్యల్పంగా గుడుపల్లెలో 29.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎనిమిది మండలాల్లో వర్షం
జిల్లావ్యాప్తంగా గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఎనిమిది మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. పాలసముద్రం, వి.కోట, పులిచెర్లలలో 18.2, రొంపిచెర్ల 16.4, పెద్దపంజాణి 10.4, చౌడేపల్లి 9.4, సదుం 6.4, బైరెడ్డిపల్లిలో 4.4 మి.మీ వర్షపాతం నమోదైంది.