Share News

కల్లూరు అడవిలో చిరుత సంచారం!

ABN , Publish Date - Apr 07 , 2024 | 02:11 AM

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కల్లూరు నుంచి కొమ్మిరెడ్డిగారిపల్లెకు వెళ్లే అడవిమార్గంలో శనివారం రాత్రి చిరుతపులి సంచరించింది.

కల్లూరు అడవిలో చిరుత సంచారం!

కల్లూరు, ఏప్రిల్‌ 6: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కల్లూరు నుంచి కొమ్మిరెడ్డిగారిపల్లెకు వెళ్లే అడవిమార్గంలో శనివారం రాత్రి చిరుతపులి సంచరించింది. కొమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన కొందరు కారులో కల్లూరుకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. కల్లూరు హైవే రోడ్డు దాటుకొని కొమ్మిరెడ్డిగారిపల్లె వైపు వెళుతుండగా రాత్రి ఏడు గంటల సమయంలో చిరుతపులి రోడ్డును దాటడం గమనించి భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్‌ఐ రవిప్రకా్‌షరెడ్డి ఆ స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - Apr 07 , 2024 | 02:11 AM