Share News

24, 25 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:29 AM

టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. సొంత నియోజకవర్గం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

24, 25 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన

కుప్పం, మార్చి 21: టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. సొంత నియోజకవర్గం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇంకా కచ్చితమైన షెడ్యూల్‌ నిర్ధారణ కాకున్నా చంద్రబాబు ఈ రెండ్రోజుల్లో సుడిగాలి పర్యటన చేయనున్నట్లు తెలిసింది. రోడ్‌ షోలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

Updated Date - Mar 22 , 2024 | 02:29 AM