పేలుడు ఘటనలో ఇద్దరిపై కేసు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:50 AM
గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన పంచాయతీ కె.లక్ష్మీరెడ్డిపల్లెకు సమీపంలోని స్టోన్ క్రషర్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన పేలుడుకు సంబంధించి ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గంగాధరనెల్లూరు, మార్చి 5: గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన పంచాయతీ కె.లక్ష్మీరెడ్డిపల్లెకు సమీపంలోని స్టోన్ క్రషర్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన పేలుడుకు సంబంధించి ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గటనలో 20 ఇళ్ళకుపైగా కిటికీలు, గాలి కిటికీలు, షోకేస్ అద్దాలు పగిలిపోయి, ఐదారు ఇళ్ల గోడలు బీటలు వారాయి. దీనిపై తహసీల్దార్ రవి, సిబ్బంది, గంగాధరనెల్లూరు ఇన్‌చార్జి సీఐ, చిత్తూరు వెస్ట్ సీఐ రవిశంకర్ తమ సిబ్బందితో కలిసి పేలుడు సంభవించిన స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. కె.లక్ష్మీరెడ్డిపల్లె గ్రామస్తులను విచారించారు. అధికారుల విచారణలో స్టోన్ క్రషర్ నిర్వహించి సుమారు మూడునెలలు కావొస్తుందని వెలుగులోకి వచ్చింది. అయితే ఏకారణం చేత సోమవారం పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనేది విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. స్టోన్ క్రషర్ లైసెన్స్ యాజమాని శ్రీధర్, స్టోన్ క్రషర్‌కు జిలెటిన్‌స్టిక్స్ సరఫరా చేసే లైసెన్స్‌హోల్డర్ రమే్‌షపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ సీఐ తెలిపారు.