కారులో మంటలు
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:04 AM
చంద్రగిరి మండలం తొండవాడ వద్ద ఆదివారం రాత్రి అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై కారు దిగిపోయారు. కారు పూర్తిగా కాలిపోయింది.
ప్రయాణికులు క్షేమం
చంద్రగిరి మండలం తొండవాడ వద్ద ఆదివారం రాత్రి అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై కారు దిగిపోయారు. కారు పూర్తిగా కాలిపోయింది. రాజమహేంద్రవరానికి చెందిన ఐదుగురు భక్తులు వేలూరు సమీపంలో గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లి కారులో తిరిగి తిరుపతికి వస్తున్నారు. తొండవాడ వద్దకు రాగానే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన భక్తులు కారు దిగి పరుగులు తీశారు. ఆ వెంటనే కారులో మంటలు వ్యాపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు దగ్ధమైంది. భక్తులు వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- చంద్రగిరి, ఆంధ్రజ్యోతి