ప్రశాంతంగా నీట్
ABN , Publish Date - May 06 , 2024 | 01:31 AM
చిత్తూరులో ఆదివారం నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించినట్లు నీట్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణబాబు తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), మే 5: చిత్తూరులో ఆదివారం నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించినట్లు నీట్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణబాబు తెలిపారు. బీవీరెడ్డి సీనియర్ సెకండరీ స్కూల్, పీఈఎస్ పబ్లిక్ స్కూల్, బృందావన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 814 మంది విద్యార్థులకు గాను 772 మంది హాజరుకాగా, 42 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, రిజిస్ట్రేషన్, ఫొటో, స్కానింగ్, బయోమెట్రిక్ అనంతరం అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఆఫ్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.