కాల్‌సెంటర్ ఏర్పాటు
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:31 AM
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
తిరుపతి(కలెక్టరేట్), జూలై 30: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం గ్రామ పంచాయతీ ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 94417 25450 ఫోన్ నెంబరుకు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని లేదా వాట్సప్ ద్వారా మెసేజ్ చేయవచ్చన్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు, అంటువ్యాధుల వ్యాప్తి సమస్యలపై ఫిర్యాదు చేయాలని కోరారు. రోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, డీఎల్‌పీవో రూపారాణి తదితరులు పాల్గొన్నారు.