మా భూములు తీసుకొని.. మాపైనే దౌర్జన్యమా?
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:57 AM
‘ప్రజల కోసమని చెప్పి మా భూములను లాక్కొని సీఎంసీకి ఇచ్చారు. ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. భూములను చదును చేస్తుండటాన్ని ప్రశ్నిస్తే మాపైనే దౌర్జన్యం చేస్తారా?’ అంటూ గుడిపాల మండలం 190 రామాపురం దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుడిపాల, మార్చి 5: ‘ప్రజల కోసమని చెప్పి మా భూములను లాక్కొని సీఎంసీకి ఇచ్చారు. ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. భూములను చదును చేస్తుండటాన్ని ప్రశ్నిస్తే మాపైనే దౌర్జన్యం చేస్తారా?’ అంటూ గుడిపాల మండలం 190 రామాపురం దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం 190 రామాపురం సీఎంసీ వద్ద సుమారు 20 కుటుంబాల వారు నిరసన తెలిపారు. 15 ఎకరాల సెటిల్‌మెంట్ భూమిని సీఎంసీ అధికారులు ఆక్రమించుకుని ఇంతవరకు రూపాయి కూడా చెల్లించకుండా కడుపు కొడుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేసేంతవరకు పోరాడతామని, బుధవారం ధర్నా చేస్తామని హెచ్చరించారు.