Share News

తిరుమల ఘాట్‌లో ఎలుగుబంటి హల్‌చల్‌

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:00 AM

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం ఓ ఎలుగుబంటి హల్‌చల్‌ చేసి భక్తులను భయపెట్టింది.

తిరుమల ఘాట్‌లో ఎలుగుబంటి హల్‌చల్‌

తిరుమల, జనవరి31(ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం ఓ ఎలుగుబంటి హల్‌చల్‌ చేసి భక్తులను భయపెట్టింది. అలిపిరి సమీపంలోని మొదటి మలుపు వద్ద రోడ్డు సమీపానికి ఎలుగుబంటి రావడం యాత్రికులను భయభ్రాంతులకు గురిచేసింది. కొంతసమయం రోడ్డుకు దగ్గరదగ్గరగా ఎలుగుబంటి సంచరించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత వాహనాల శబ్దాలను గమనించి ఎలుగుబంటి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది.

Updated Date - Feb 01 , 2024 | 01:00 AM