Share News

కోడిపందేలు ఆపమన్నందుకు పోలీసులపై దాడి

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:51 AM

కోడి పందేలను ఆపమన్నందుకు పోలీసులపైనే దాడి చేసిన సంఘటన వాకాడు మండలంలో చోటు చేసుకుంది.

కోడిపందేలు ఆపమన్నందుకు పోలీసులపై దాడి

- ఎస్‌ఐ సహా ముగ్గురికి గాయాలు

వాకాడు, ఫిబ్రవరి 11: కోడి పందేలను ఆపమన్నందుకు పోలీసులపైనే దాడి చేసిన సంఘటన వాకాడు మండలంలో చోటు చేసుకుంది. దుగరాజపట్నం పంచాయతీ కొండూరుపాళెం మద్యంషాపు పక్కన ప్రతి ఆదివారం కోడిపందేలు నడుస్తుంటాయి.సెబ్‌ ఎస్‌ఐ జయరావు ఇద్దరు సిబ్బందితో కలిసి మఫ్టీలో ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు కోడిపందేలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. కోడిపందేలు ఆపివేయాలని చెప్పడంతో ఆగ్రహించిన కొండూరుపాళెం,అంజలాపురం ప్రాంతాలకు చెందిన పందెంరాయుళ్లు ఒక్కసారిగా దాడికి దిగారు.సెబ్‌ ఎస్‌ఐ జయరావుకు ముఖంపై గాయం కావడంతో కోటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఎస్‌ఐ పవన్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:51 AM