Share News

దారి దోపిడీ దొంగల అరెస్టు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:52 AM

రాత్రివేళల్లో హైవేల్లో ఆగివున్న లారీలు, వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ లక్ష్మణ్య తెలిపారు.

దారి దోపిడీ దొంగల అరెస్టు

బంగారుపాళ్యం, ఏప్రిల్‌ 6: రాత్రివేళల్లో హైవేల్లో ఆగివున్న లారీలు, వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ లక్ష్మణ్య తెలిపారు. వివరాలిలా వున్నాయి. చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిలోని తిమ్మోజిపల్లె వద్ద ఏప్రిల్‌ ఒకటో తేది రాత్రి సిమెంట్‌ లోడుతో ఆగివున్న లారీలో నిద్రిస్తున్న డ్రైవర్‌, క్లీనర్లను బెదిరించి వీరు దొంగతనానికి పాల్పడ్డారు. అదేవిధంగా శేషాపురం డాబా వద్ద ఆగివున్న లారీలో కూడా దొంగతనానికి పాల్పడ్డారు. లారీ డ్రైవర్లు ఫిర్యాదు చేయడంతో బంగారుపాళ్యం పోలీసులు శుక్రవారం చిత్తూరుకు చెందిన చంద్రు, గంగాధరనెల్లూరు మండలం కాళేపల్లికి చెందిన గోపీనాథ్‌, చిత్తూరు జెండామానువీధికి చెందిన దినకర్‌లను శుక్రవారం కేజీసత్రం వద్ద అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనపరచుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 12:52 AM