Share News

అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:38 AM

వైభవంగా లక్ష కుంకుమార్చన నేడు ధ్వజారోహణం

అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
పుట్టమన్ను సేకరిస్తున్న అర్చకులు - విష్వక్సేనుడి ఊరేగింపు

తిరుచానూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దేవేరి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారి సన్నిధి ముఖమండపం వద్ద సర్వసేనాధిపతి విష్వక్సేనుడిని కొలువుదీర్చారు. కంకణభట్టాచార్యులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వేంచేపుగా ఉద్యానవనానికి తీసుకొచ్చి పుట్టమన్ను సేకరించారు. మాడవీధుల్లో ఊరేగింపుగా ఆలయంలోని యాగశాలకు తీసుకొచ్చారు. నవపాలికలో పుట్టమన్ను నింపి అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, ఏవీఎ్‌సవో సతీ్‌షకుమార్‌, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, మణికంఠస్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్‌ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు ధ్వజారోహణం

గురువారం ఉదయం 9.30 గంటలకు ధనుర్లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రంగా అర్చకులు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అమ్మవారితో పాటూ గజచిత్రపటాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొస్తారు. ధ్వజస్తంభంపైకి గజపటాన్ని ఎగురవేయడంతో ధ్వజారోహణం పూర్తవుతుంది. రాత్రికి చిన్న శేష వాహన సేవతో అమ్మవారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి.

ముత్యపు కవచంలో అమ్మవారి దర్శనం

పద్మావతి అమ్మవారు బుధవారం ముత్యపు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. రోజూ వజ్ర, వైఢూర్య, స్వర్ణాభరణాలతో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవ వేళ మాత్రమే అమ్మవారి మూలవర్లకు ప్రత్యేకంగా తయారు చేయించిన ముత్యపు కవచాన్ని అలంకరిస్తారు.

Updated Date - Nov 28 , 2024 | 01:03 AM